Thursday, September 19, 2024

ఆర్టీసి బస్సులో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు(శుక్రవారం) ఆర్టీసి బస్సులో ప్రయాణించి, ప్రయాణికులకు తమ పార్టీ మేనిఫెస్టో తాలూకు వివిధ పథకాల గురించి వివరించారు. రాహుల్ గాంధీ అయితే యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ వంటి పథకాల గురించి ప్రయాణికులతో ఇంటరాక్ట్ అయ్యారు.

వారు దిల్ సుఖ్ నగర్ లో బస్సెక్కారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంపై విజయం సాధించాక  కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకాన్ని తెచ్చింది. ఈ పథకాన్ని గత ఏడాది డిసెంబర్ లో ఆరంభించారు. రాహుల్ గాంధీ మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఇంటరాక్ట్ అవ్వడమేకాక, వారి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ నిరుద్యోగం పెరిగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ మాట్లాడారు. ఇదిలావుండగా తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News