Wednesday, January 22, 2025

సొంత ఇల్లు, కారు లేని రాహుల్ గాంధీ ఆస్తి ఎంతో తెలుసా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అయితే ఆయనకు సొంత ఇల్లు కాని, సొంత కారు కాని లేవు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో మరోసారి దిగుతున్న రాహుల్ గాంధీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తులివి. రాహుల్‌కు రూ. 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అందులో రూ. 55,000 నగదు, రూ. 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.4.32 కోట్ల బాండ్లు, షేర్లు, రూ.3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ.4.20 లక్షల నగలు ఉన్నాయి.

కాంగ్రెస్ అగ్రనేతకు రూ. 11.15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇందులో తన సోదరి ప్రియాంక గాంధీతో కలసి ఢిల్లీలోని మెహ్రౌలిలో వ్యవసాయ భూమి ఉంది. గురుగ్రామ్‌లో రూ.9 కోట్ల విలువచేసే ఆఫీస్ స్పేస్ కూడా ఆయనకు ఉంది. వ్యవసాయ భూమిని వారసత్వంగా వచ్చిన ఆస్తిగా పేర్కొన్న ఆయన ఆఫీస్ స్పేస్ గురించి వెల్లడించలేదు. తనపైన నమోదైన పోలీసు కేసుల గురించి కూడా ఆయన వివరంగా ప్రస్తావించారు. వీటిలో ఒక పోక్సో కేసు కుంది ఉంది. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను ఒక సోషల్ మీడియా పోస్టులో వెల్లడించినందుకు ఆయనపై పోక్సో కేసు నమోదైంది.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌ను సీల్డ్ కవర్‌లో పోలీసులు అందచేశారని, అందులోని వివరాలు తనకు తెలియవని, తనను నిందితుడిగా చేర్చారా లేదా అన్న విషయాలు తనకు తెలియనప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ కేసును కూడా ప్రస్తావించానని రాహుల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బిజెపి నాయకులు దాఖలు చేసిన పరువునష్టం కేసులను కూడా రాహుల్ ప్రస్తావించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు సబంధించిన నేరపూరిత కుట్ర కేసును కూడా రాహుల్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో వయనాడ్ సీటును గెలుచుకున్న రాహుల్ గాంధీ 2024 ఎనిష్టిపిఐ నాయకుడు అన్నీ రాజా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌తో తలపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News