Monday, December 23, 2024

’నేషనల్ హెరాల్డ్‘ కేసులో విచారణకు రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,  నాయకులు రాజధానిలో నిరసనలు చేపట్టారు. అంతకుముందు రాహుల్ గాంధీకి మద్దతుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొత్తం, ఆ పార్టీ ఇద్దరు ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్ , దాని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఇదిలావుండగా అరెస్టయిన కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ పరామర్శించారు.

Rahul Gandhi

Priyanka Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News