Friday, November 22, 2024

5న రాహుల్ రాక

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై ఈనెల 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు బోయినపల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెం టర్‌లో పిసిసి ఆధ్వర్యంలో మేధావుల అభిప్రాయ సేకర ణ నిర్వహించబోతున్నామని, ఈ సమావేశానికి రాహు ల్ గాంధీ పాల్గొంటారని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌ డ్ చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని ఆ యన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్ వివరాలు తెలుసుకుంటారన్నారు. శనివారం గాంధీభవన్‌లో కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడా రు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని కో రుతున్నామన్నారు. కులగణనపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నడుస్తుందని, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారన్నారు.

ప్రతి ఒక్క కార్యకర్త సర్వేలో పాల్గొనాలని ఆయన సూచించారు. టిపిసిసి ఆ ధ్వర్యంలో కులగణన అంశంపై ఈ నెల 6 లేదా 7వ తే దీన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతోందని మం త్రులు, ఎమ్మెల్యేలు స్వతంత్రంగా పని చేస్తున్నారని మ హేశ్ తెలిపారు. సిఎం ఉండగా కొత్త సిఎం ప్రస్తావన తె స్తున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి బిజెపిలో దక్కుతున్న గౌ రవం గురించి ఆలోచించుకోవాలని ఎద్దేవా చేశారు. ఉ త్తమ్, భట్టి అందరూ సీనియర్ నేతలని, సీనియర్ మం త్రులతో కూడిన సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వేచ్ఛగా, సజావుగా పనిచేస్తుందన్నారు. బిజెపి ఆఫీస్‌లో మహేశ్వర్ రెడ్డికి కుర్చీలేదని, కిషన్ రెడ్డికి ఏలేటికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయన్న సమాచారం తమకు ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న మోడీ ముందు ఆయన ఇస్తానన్న సంక్షేమ పథకాలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పాలని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

కొత్తవి ఇచ్చే బదులు ప్రభుత్వ సంస్థలను అమ్మేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదలు, రైతుల గురించి మాట్లాడే హక్కు మోడీకెక్కడిదని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ మాదిరిగా తమది ఫాసిస్టు ప్రభు త్వం కాదన్నారు. కులగణన సమగ్రంగా నిష్పక్షపాతం గా జరగాలన్నదే తమ ఆలోచన అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News