Monday, December 23, 2024

మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం : రాహుల్

- Advertisement -
- Advertisement -

మైసూరు : కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు కేవలం పథకాలే కాదని, సమర్థవంతమైన పాలనకు నమూనా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఐదు హామీల్లో ఒక్కటి మినహా నాలుగు హామీలు మహిళా సాధికారతకు ఉద్దేశించినవేనని చెప్పారు. ఎన్నికల్లో హామీల్లో ఒకటైన “గృహలక్ష్మి ” పథకాన్ని రాహుల్ గాంధీ మైసూరులో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ , రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరి ప్రియాంక గాంధీ ఈరోజు రాఖీ కట్టిందని, ఇదే రోజు తన చేతుల మీదుగా “గృహలక్ష్మి” పథకం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఈ బటన్ నొక్కిన వెంటనే కోట్లాది మంది మహిళల బ్యాంకు అకౌంట్లలో నేరుగా రూ.2000 చొప్పున జమ అవుతాయని చెప్పారు.

ప్రతినెలా రూ.2000 వంతున మహిళల బ్యాంకు అకౌంట్లలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. కర్ణాటక లోని మహిళలందరికీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చామన్నారు. మహిళా సాధికారతే తమ పథకాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

1.28 కోట్ల మంది మహిళలకు లబ్ధి
గృహలక్ష్మి పథకం ద్వారా 1.20 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేయాలనే రాజకీయ సంకల్పం తమ ప్రభుత్వానికి ఉందన్నారు. తాము ఇచ్చిన ఐదు హామీల అమలుకు రూ. 50,000 కోట్లు ఖర్చవుతాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News