Friday, December 20, 2024

ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అధికార ఎన్‌డిఎ కూటమిపై పార్లమెంట్‌లో ప్రత్యక్ష పోరుకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓకే చెప్పారు. లోక్‌సభలో విపక్ష నేతగా పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సిడబ్లూసి చేసిన తీర్మానం, ఇండియా కూటమి ప్రతిపాదనకు ఆయన సమ్మతించారు. లోక్‌సభలో ఇండియా కూటమి నాయకుడిగా పగ్గాలు స్వీకరించేందుకు ఒప్పుకున్నారు. మంగళవారం నాడు రాత్రి ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది.

అనంతరం లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ వ్యవహరిస్తారని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు లోక్‌సభ ప్రొటెమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్‌కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ లేఖ పంపారని సీనియర్ నాయకుడు కెసి వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. రాహుల్ గాంధీ ఐదు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి విజయం సాధించిన రాహుల్ వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా 20 సంవత్సరాల తర్వాత లోక్‌సభలో విపక్ష నేత పదని గాంధీ కుటుంబం చేపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News