Thursday, September 19, 2024

బంగ్లాదేశ్ అల్లర్లలో విదేశీ హస్తం ఉందా? : రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ ను పాలించిన ప్రధాని షేఖ్ హసీనా సోమవారం ప్రాణాలు చేతపట్టుకుని దేశం వదిలి ఇండియాకు చేరింది. అక్కడి మిలిటరీ దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ లో చెలరేగుతున్న అల్లర్లను అణచేయడానికి జులై నుంచే హసీనా ప్రభుత్వం ప్రయత్నించింది. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు నాటి నుంచే మొదలయ్యాయి. ఇదిలావుండగా బంగ్లాదేశ్ లో ఆదివారం అల్లర్ల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు.

బంగ్లాదేశ్ సమస్యపై అఖిలపక్ష సమావేశంలో, లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశ విదేశాంగ విధానం భవిష్యత్తు గురించి ఆందోళనలను లేవనెత్తారు, ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న సంఘటనల వెలుగులో. ప్రభుత్వం వివరించిన తరువాత, జాతీయ ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలకు తన మద్దతును రాహుల్ గాంధీ  వ్యక్తం చేశారు. ‘ఈ సంఘటనలో విదేశీ శక్తుల ప్రమేయం ఉందా?’ అని కూడా ఆయన ప్రశ్నించారు.  బంగ్లాదేశ్‌లోని మైనారిటీల స్థితిగతుల గురించి ఆందోళనలను వ్యక్తం చేస్తూ, వారి ఆస్తులపై దాడుల నివేదికలను కోరారు.

ప్రిఫరెన్షియల్ జాబ్ కోటాలకు వ్యతిరేకంగా మొదట నిరసనలు మొదలయ్యాయి. తర్వాత అది తీవ్ర సమ్మెలకు దారితీశాయి. పైగా ప్రధాని హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ వరకు వెళ్లాయి. చివరికి భయాందోళనలతో షేఖ్ హసీనా దేశం వదిలి ఇండియా చేరుకున్నారు.

ఇదిలావుండగా అధ్యక్షుడు ముహమ్మద్ షాబుద్దీన్ త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పార్లమెంటును రద్దు చేయడమేకాక, మాజీ ప్రధాని ఖాలీదా జియాను నిర్బంధం నుంచి విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుండగా షేఖ్ హసీనా రాజీనామా చేసి, దేశం వదిలిపోయాక బంగ్లాదేశ్ కు ఇచ్చిన రుణంపై ఎలాంటి ప్రభావం పడనున్నదానిపై ప్రపంచ బ్యాంకు అంచనాలు వేస్తున్నది. మరోవైపు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులు సురక్షితంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News