న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌రేగా) కింద పలు రాష్ట్రాల శ్రామికులకు వేతనాలు(కూలీ డబ్బులు) అందడంలేదని, అచ్ఛేదిన్(మంచి రోజులు) అంటే ఇదేనా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్విట్ చేశారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో గ్రామీణ పేదలకు అదనపు తోడ్పాటు అందించాల్సి ఉండగా, చట్టపరంగా వారికి ఇవ్వాల్సినవి కూడా అందకుండా పోయాయని రాహుల్ విమర్శించారు. పేదల కనీస జీవితం కూడా కష్టమైన సమయంలో వారి హక్కులను నిరాకరించడం అచ్ఛేదిన్ ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఇచ్చిన నినాదాన్ని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ విమర్శించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పు పడ్తూ మరికొన్ని ట్విట్లు కూడా రాహుల్ పోస్ట్ చేశారు. రాఫెల్ ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలను గుర్తు చేస్తూ రాఫెల్ స్నేహితులని ట్విట్ చేశారు. పన్నుల పెంపును గుర్తు చేస్తూ ట్యాక్స్ కలెక్షన్ అని, పెట్రోల్ ధరలు పెంచడాన్ని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను గుడ్డిగా తీసుకున్న నిర్ణయమన్నారు. ప్రశ్నిస్తే జైలుకు పంపడమే మోడీ ప్రభుత్వం తీరు అంటూ రాహుల్ ఆరోపించారు.
Rahul Gandhi Attacks Centre On MNREGA Wages