న్యూఢిల్లీ: లడఖ్, ఉత్తరాఖండ్‌లో చైనా చొరబాటుకు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014 లోక్‌సభ ఎన్నిక ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ తన 56 అంగుళాల ఛాతీ గురించి డబ్బా కొట్టుకోడాన్ని కూడా ఆయన తన ట్వీట్లో దుయ్యబట్టారు.
“చైనా+పాకిస్థాన్+మిష్టర్ 56
=
భారత్‌పై పెరుగుతున్న చైనా భూకబ్జా” అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.
ఆయన ఈ ట్వీట్‌ను లడఖ్, ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న చైనా ఆక్రమణను ఉద్దేశించి చేశారు. ఆగస్టు 30న ఉత్తరాఖండ్‌లోని బరాహొటి సెక్టార్ వాస్తవాధీన రేఖను 100 మంది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్ఎ) సైనికులు అతిక్రమించారు. కొన్ని గంటలు గడిపాక వారు తిరిగి తమ ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ఈ చైనా అతిక్రమణపై ఎలాంటి అధికారిక వ్యాఖ్య లేదు.
తూర్పు లడఖ్ నుంచి ఇరు దేశాల సైనికులు తమ సైన్యాన్ని వెనక్కి తగ్గించుకున్నప్పటికీ ఈ అతిక్రమణ జరిగింది. చైనా వారు తమ వైపు వాస్తవాధీన రేఖ వెంబడి మౌలికవసతులను గణనీయంగా పెంచుకున్నారు కూడా. 2020 మే 5న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకోవడంతో చైనా, భారత్‌ల మధ్య మిలిటరీ ఉద్రిక్తతలు పెరిగాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డుల నుంచి ఇరుదేశాలు తమ బలగాలను, ఆయుధాలను ఉపసంహరించుకున్నాయి. ఆ సున్నిత సెక్టార్లో ఇప్పటికీ ఇరుదేశాలు దాదాపు 50000 నుంచి 60000 బలగాలను నిలిపి ఉంచాయి. లడఖ్‌లో చైనా చొరబాటుపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ కడిగిపారేస్తున్నారు.
चीन + पाकिस्तान + Mr 56”
=
भारत भूमि पर बढ़ता चीनी क़ब्ज़ा।#Ladakh #Uttarakhand pic.twitter.com/7rel1NFE6M— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2021