గ్రాఫ్‌లతో పాటు రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ సరిలేరు తనకెవ్వరు అనే ధోరణితో ఉండటంతో దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రుణభారం ఇవన్నీ ఈ ఇగో పరిణామాలే అని రాహుల్ స్పందించారు. ఎకనామిక్స్‌ను పక్కకు పెట్టి ఈగోనామిక్స్ ఏలుబడిలోకి రావడం అనర్థాలకు దారితీసిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండేందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలి తప్ప అధికారంలో ఉన్న వారి అహం చాటుకునే చేతలకు దిగరాదని, అయితే దిగుతున్నారు కాబట్టే ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివి తలెత్తాయనిఅన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితి, ధరలు, ద్రవ్యోల్బణం ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ఛార్ట్‌ను జతపర్చారు. 2014 సంవత్సరం 2022 సంవత్సరాల మధ్య ఉన్న వివిధ ఆర్థిక తేడాలను విశ్లేషించారు.
2014 దేశ ఆర్థిక స్థితి గ్రాఫ్ ఇది
ప్రభుత్వ రుణాలు రూ 56 లక్షల కోట్లు …నిరుద్యోగం 4.7 శాతం ..వ్యాపార లోటు 135 బిలియన్ డాలర్లు …డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ 59.. సిలిండర్ గ్యాసు ధర రూ 410, తలసరి రుణభారం రూ 44,348
2022 దేశ ఆర్థిక స్థితి గ్రాఫ్ ఇది
ప్రభుత్వ రుణాలు ఇప్పుడు రూ 139 లక్షల కోట్లు ..నిరుద్యోగం 7.8 శాతం …వ్యాపార లోటు 190 బిలియన్ డాలర్లు ….డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80. సిలిండర్ గ్యాసు ధర రూ 1,053…..తలసరి రుణభారం రూ 1,01,048