Monday, November 18, 2024

దేవుడిని సైతం తికమక పెట్టగల మోడీ: రాహుల్ చెణుకులు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీని దేవుడి పక్కన కూర్చోపెడితే ఈ వ్రిశ్వం ఎలా పనిచేస్తుందో ఆ దేవుడికే పాఠాలు చెబుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెణుకులు విసిరారు. ఆరు రోజుల అమెరికా పర్యటన నిమిత్తం మంగళవారం శాన్‌ఫ్రాన్సిస్కో వచ్చిన రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ&ప్రధాని మోడీ పాఠాలు విన్న దేవుడు సైతం తాను సృష్టించిన విశ్వం గురించి గందరగోళంలో పడతాడని వ్యాఖ్యానించారు. అన్నీ తమకు తెలుసునని, తాము సర్వజ్ఞులమని భావించే వ్యాధి ఉన్న కొంతమంది వ్యక్తుల చేతుల్లో భారతదేశం ఇప్పుడు నడుస్తోందని రాహుల్ చెప్పారు.

Also Read: శ్రీవారు కరీంనగర్‌లో కొలువు దీరడం మా అదృష్టం: గంగుల

వివిధ భాషలు, వివిధ మతాలకు చెందిన ప్రజల మధ్య మనం ఒకప్పుడు పెరిగామని, కాని ఇప్పుడు వాటిపైనే దాడి జరుగుతోందని ఆయన అన్నారు. మహాత్మా గాంధీ, గురునాన్ వంటి మహనీయులు జన్మించిన భారతదేశంలో తాము సర్వజ్ఞానులం కామన్న సంప్రదాయం ందని, కాని ఇప్పుడు తమకు అన్నీ తెలుసునని నమ్మే వ్యాధిగల కొన్ని బృందాలు ఉన్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ బృందాలు ఎలాంటివంటే శాస్త్రవేత్తలకే సైన్సు పాఠాలు, చరిత్రకారులకే చరిత్ర పాఠాలు, సైన్యానికే యుద్ధరీతి గురించి చెప్పగలమని నమ్ముతాయని రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిజానికి ఈ బృందాలకు ఏ విషయం గురించి ఏమీ తెలియదని, కాని ఆ విషయం వారు ఒప్పుకోరని ఆయన వ్యాఖ్యానించారు.

గత ఏడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమై ఈ ఏడాది జనవరి 30న కశ్మీరులోని శ్రీనగర్‌లో ముగిసిన తన 4,000 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర గురించి కూడా రాహుల్ మాట్లాడారు. ప్రజల మధ్య సుహృద్భావం, మానవతా సంబంధాలు, పరస్పర గౌరవం పెంపొందాలన్న లక్షంతో తన యాత్ర సాగినట్లు ఆయన తెలిపారు. గురు నానక్ దేవ్, గురు బసవన్న, నారాయణ గురు వంటి ఆధ్యాత్మిక నాయకులందరూ ఇదే మార్గంలో పయనిచి దేశాన్ని సమైక్యంగా ఉంచారని ఆయన అన్నారు.

అనర్హత వేటు కారణంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్ తన దౌత్య పాస్‌పోర్టును ప్రభుత్వానికి స్వాధీనం చేసి సాధారణ పాస్‌పోర్టుపై అమెరికాకు చేరుకున్నారు.విమానాశ్రయంలో రాహుల్‌కు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ శాం పిట్రోడ, ఇతర సభ్యులు స్వాగతం పలికారు. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం రాహుల్ విమానాశ్రయంలో రెండు గంటలపాటు వేచి ఉనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో కొందరు ప్రయాణికులు ఎందుకు వేచి ఉన్నారని రాహుల్‌ను ప్రశ్నించగా&నేను కూడా సామాన్యుడినే..నేను ఎంపీని కాను. ఇలా ఉండడం నాకు నచ్చింది..అంటూ సమాధానమిచ్చారు.

తన ఆరు రోజుల అమెరికా పర్యటనలో రాహుల్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని వర్గాలు తెలిపాయి. మంగళవారం మొదటిరోజు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆయన ప్రవాస భారతీయులు, వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్ ఎగ్జిక్యుటివ్‌లు, సిలికాన్ వ్యాలీకి చెందిన విద్యార్థులతో భేటీ అయ్యారు. బుధవారం కూడా ఆయన సిలికాన్ వ్యాలీకి చెందిన సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యుటివ్‌లతో కృత్రిమ మేధపై చర్చలు జరుపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News