Tuesday, September 17, 2024

ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు

- Advertisement -
- Advertisement -

పుణె: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు పతంగ్ రావు కదం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహారాష్ట్రలోని సాంగ్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడానికి కారణం విగ్రహ తయారీలో శిల్పి అవినీతి ఉందన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలన్నారు. అంతేకాక పెద్ద నోట్ల రద్దు(డీ మానిటైజేషన్), తప్పుడు పద్ధతిలో జిఎస్ టి అమలు చేయడంపై కూడా ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలన్నారు.

సింధుదుర్గ్ లోని రాజ్ కోట్ కోట వద్ద శివాజీ విగ్రహం కూలిపోయింది. ప్రధాని మోడీ గత వారం మహారాష్ట్ర సందర్శించి క్షమాపణలు కూడా కోరారు. ‘మహారాష్ట్ర చక్రవర్తి మా ఆరాధ్య దైవం’ అని కూడా అన్నారు. 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని మోడీ గత ఏడాది డిసెంబర్ 4న ఆవిష్కరించారు. కానీ ఆ విగ్రహం ఆగస్టు 26న కూలిపోయింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ‘ ప్రధాని మోడీ కేవలం మహారాష్ట్ర రాజుకే కాదు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి క్షమాపణలు చెప్పాలి’ అన్నారు.

‘ప్రధాని పెద్ద కాంట్రాక్టులను కొంత మంది పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నందుకు, పెద్ద నోట్లను రద్దు చేసినందుకు(డీమోనిటైజేషన్), తప్పుడు జిఎస్ టి విధానం అవలంబించినందుకు, దానివల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులు దెబ్బతినడమేకాక, తద్వారా నిరుద్యోగం పెరిగినందుకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి’ అని రాహుల్ గాంధీ అనక్నారు. కోట్ల కొద్ది రూపాయల రుణ మాఫీ బడా పారిశ్రామిక వేత్తలకు చేస్తూ, రైతులకు రుణమాఫీ చేయకపోవడంపై కూడా విమర్శించారు. ధనవంతులకు రుణ మాఫీ చేసినప్పుడు, పేదలకు ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. త్వరలో మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షం(మహా వికాస్ అఘడి కూటమి) గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ‘‘ అవసరమైనప్పుడు నేను ఇక్కడ ఉంటాను’’ అని భరోసా ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News