Monday, December 23, 2024

తెలంగాణలో కులగణన దేశానికే ఆదర్శం: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో జరిగే కులగణన దేశంలోనే ఆదర్శం కాగలదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బోయినపల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బిసి సంఘాలతో రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. కుల వివక్ష, కుల వ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు కూడా ఎక్కువే ఉంటాయన్నారు.  కులగణన ద్వారా దళితులు, ఓబిసిలు, మహిళల సంఖ్యపై స్పష్టత రాగలదన్నారు. కులగణన చేస్తామని పార్లమెంటులోనే స్పష్టం చేశామన్నారు. ఇదిలావుండగా బుధవారం నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News