Sunday, January 19, 2025

రాహుల్ గాంధీపై సస్పెన్షన్ ఎత్తివేత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ‘మోడీ ఇంటిపేరు’పై వ్యాఖ్యల నేపథ్యంలో పరువు నష్టం కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతోపాటు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే రాహుల్ జైలుశిక్షపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ లోక్ సభ సచివాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాహుల్ పై అనర్హతవేటు ఎత్తివేస్తున్నట్లు లోక్ సభ సచివాలయం ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News