Monday, December 23, 2024

నిరాటంకంగా సాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు ఆయన 25 కిమీ. సునాయాసంగా నడుస్తూ ముందుకుసాగుతున్నారు. ఆయన రాబోయే 14ం రోజుల్లో మొత్తం స్ట్రెచ్‌ను కవర్ చేస్తారని తెలుస్తోంది. దీనివల్ల ఆయన శీతాకాలం పార్లమెంటు సమావేశాలను కూడా ఎగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈయన తమిళనాడు, కేరళలో ప్రజల ప్రేమాభిమానాలను చురగొంటు సాగుతున్నారు. ఇక ఆయన బిజెపికి పట్టున్న కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కూడా తన యాత్రను విజయవంతంగా కొనసాగిస్తారని తెలుస్తోంది. కాగా మధ్యప్రదేశ్ ఆయన యాత్రకు ఓ పరీక్షలా ఉండనునన్నదని అనుకుంటున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ధరించిన టి-షర్టు, వివాదాస్పద పాస్టర్ జార్జి పున్నయ్యతో భేటీ బిజెపి విమర్శలకు గురైంది. ఒకవేళ రాహుల్ గాంధీ మొత్త భారత్ జోడో యాత్రను పూర్తి చేస్తే ఆయనకు దేశవ్యాప్తంగా ఓ గుర్తింపు రావడం ఖాయం. అయితే బిజెపికి పట్టున్న ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ఇమేజిని దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరగొచ్చు. బిజెపి ఇప్పటికే ఆయనను ‘పప్పు’ అని తక్కువజేసే ప్రయత్నం చేసి ఆయనను ఎదగకుండా తొక్కిపెట్టింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధిస్తేనే రాహుల్ గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఉండగలదని ఇక్కడ గమనార్హం. బిజెపి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఢీకొనగల కొద్ది మంది నాయకులలో రాహుల్ ఒకరని చెప్పకతప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News