యెలిగండ్ల: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలో జయప్రదంగా కొనసాగుతోంది. ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు వచ్చి చేరారు. ఒడిశా నుంచి మాజీ కేంద్ర మంత్రి భక్త చరణ్ దాస్, మధ్యప్రదేశ్ నుంచి జితు పట్వారి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు వచ్చి చేరడం ‘మినీ భారత్ జోడో ’లా ఉందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం నారాయణ్‌పేట్ జిల్లాలోని యెలిండ్ల నుంచి మొదలయింది. రాత్రి మహబూబ్‌నగర్‌లో హాల్ట్ ఉంటుంది. తెలంగాణలో ఇది మూడో రోజు యాత్ర. ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యకుమారి నుంచి సెప్టెంబర్ 7న ఆరంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గుండా పయనించి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది.
Rajiv Gandhi Foundation—harassed, defamed & intimidated by Modi govt—has done yeoman service in different areas over 3 decades. Today during #BharatJodoYatra 28 differently-abled people, past beneficiaries of the trust, met @RahulGandhi in Devarakadra to express their gratitude. pic.twitter.com/PMiZOXAkjN
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 28, 2022