హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర షాద్ నగర్ లో ఆరో రోజు మొదలైంది. భారత్ జోడో యాత్ర సోమవారం 28కి.మీ దూరం సాగనున్నది. రాహుల్ పాదయాత్ర కన్యాకుమారి నుంచి 54 రోజులుగా కొనసాగుతుంది. వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. బిజెపిపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విద్యా సంస్థల ప్రయివేటీకరణకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగు పరుస్తామని చెప్పారు. ఈరోజు లింగారెడ్డిగూడ, చాంద్రాయన గూడ, కొత్తూరు మీదుగా పెద్దషాపూర్ ముచింతల వరకు ఆయన యాత్ర సాగనున్నది. అనంతరం శంషాబాద్ తొండుపల్లి వద్ద రాహుల్ రాత్రికి బస చేయనున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
6వ రోజు జోరుగా కొనసాగుతున్న జోడో యాత్ర
- Advertisement -
- Advertisement -
- Advertisement -