లేహ్ : కేంద్ర పాలిత ప్రాంతంల లడఖ్ లోని లేహ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు శనివారం ఆయన బైక్‌రైడ్ చేపట్టారు. రైడ్ ప్రారంభానికి ముందు రాహుల్ మాట్లాడుతూ “ ప్రపంచం లోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని మానాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారని తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్‌తమ ఎక్స్ (ట్విటర్ ) ఖాతాలో పంచుకుంది. ఆగస్టు 20న తన తండ్రి , మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని రాహుల్ ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాహుల్ గత గురువారం లేహ్ పర్యటనకు వచ్చారు. మొదట రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా, ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019 లో ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత రాహుల్ లడఖ్‌కు రావడం ఇదే తొలిసారి. శుక్రవారం ఆయన లేహ్ లోని యువతతో ముచ్చటించారు.
సెప్టెంబర్ 10న లడక్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కార్గిల్ ప్రాంతంలో కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్ , లేహ్ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.