Sunday, February 23, 2025

ఆ ఘటనపై సిఎం రేవంత్‌కు ఫోన్ చేసిన రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చే వరకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి రాహుల్ సూచించారు.

ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్‌గాంధీతో రేవంత్ తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొన సాగుతున్నాయని సిఎం రేవంత్ వివరించారు. మరోవైపు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతు న్నాయని సిఎం పేర్కొన్నారు. ఇందులో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొందని రాహుల్‌తో సిఎం రేవంత్ తెలిపారు. సంఘటనా స్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News