- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీలో రైతులు ఆందోళనను కొనసాగించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రైతులకు రాహుల్ గాంధీ మద్దతిచ్చారు. అన్నదాతలు నిరసనలు కొనసాగించాలన్నారు. కర్షకులు తమ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రైతులతో పాటు ఇతర వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని వెల్లడించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎర్రకోట ఘటనపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రైతులు ధర్నా చేస్తున్న చోట్లలో స్థానికులు దాడులకు దిగుతున్నారు. తమ ప్రాంతాలను ఖాళీ చేయాలని వారు రైతులను హెచ్చరిస్తున్నారు.
Rahul Gandhi calls farmers to continue protest
- Advertisement -