Monday, March 10, 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటు వేసిన రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఢిల్లీ ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు కూడా తమ ఓటును వినియోగించుకుంటున్నారు. కొద్దిసేపటిక్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఓటు వేశారు. నిర్మాణ్‌ భవన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో రాహుల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాంతినికేతన్‌ కేంద్రంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ ఓటు వేశారు.అలాగే, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఢిల్లీ బిజెని అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. మయూర్‌ విహార్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన సతీమణితో కలిసి ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News