న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ ఖాతాలో తన ‘డిస్క్రిప్షన్’ మార్చారు. తనను ‘డిస్’క్వాలిఫైడ్ ఎంపీ’ అని పేర్కొన్నారు. లోక్‌సభ నుంచి ఆయనను అనర్హుడిగా ప్రకటించిన తర్వాత ఆయన ఇలా చేశారు. ఆయన ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలోని ‘బయో’లో ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు, డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అని మార్చారు.
పార్లమెంటులో అదానీ గ్రూప్‌పై రాహుల్ గాంధీ తదుపరి ప్రసంగానికి మోడీ భయపడ్డంతో ఆయనపై వేటు పడిందని చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు రాహుల్‌పై వేటుపడ్డంతో ప్రతిపక్షాలకు ‘పెద్ద అస్త్రం’ లభించినట్లయింది. ఇక వారు మోడీని, అతడి బలగాన్ని దమ్ముదమ్ముచేయక మానరని తెలుస్తోంది. రాహుల్ గాంధీ ‘భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, నేను సావర్కర్‌ను కాను, గాంధీని’ అని చేసిన ప్రకటనలు ఇప్పుడు బిజెపి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ‘సత్యాగ్రహ’ చేపట్టనున్నది. దానికి అనేక వర్గాల నుంచి సంఘీభావం లభిస్తోంది. ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో జరిగే ‘సత్యాగ్రహ’ నిరసనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కెసి. వేణుగోపాల్, తదితరులు హాజరవుతున్నారు.