ఢిల్లీ: గ్యాస్ ధరలు మళ్లీ పెంచడంతో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు గ్యాస్ ధరలు 116 శాతం పెరిగాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు అన్ని రంగాలపై ప్రభావం చూపిందన్నారు. దేశ ప్రజల ఆస్తులు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. మోడీ పాలనలో సామాన్యుల జీవనం అస్తవ్యస్థంగా మారిందన్నారు. కేంద్రం పేదల పట్ల వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం బుధవారం గ్యాస్‌పై 25 రూపాయలు పెంచిన విషయం తెలిసింది. #indiaAgainstBJPLoot అనే యాస్ ట్యాగ్ వైరల్ చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలతో పేదల ఆకలితో అలమటిస్తున్నారన్నారు. గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ ధర రెండు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ నేత రన్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. 2014లో గ్యాస్ ధర రూ.410 ఉంటే, 2021లో రూ. 884 చేరుకుందని రన్ దీప్ మండిపడ్డారు.