కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన జోడో యాత్రను రాహుల్ ప్రస్తావిస్తూ.. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారని యాత్రలో తను చాలా విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు. తొలుత తన జ్ఞానాన్ని రైతులతో పంచుకునేవాడిని, కానీ అనంతరం వినడం ప్రారంభించాను. జమ్ము కాశ్మీర్ చేరుకునే సమయానికి పూర్తి నిశ్శబ్దంగా మారిపోయాను అని రాహుల్ వెల్లడించారు. యాత్ర కాశ్మీర్లోకి ప్రవేశించగానే వేలాదిమంది ప్రజలు యాత్రలో భాగస్వాములయ్యారు. కాశ్మీర్ ప్రజలు బాధలో ఉన్నప్పుడు దేశంలోని ఇతరులు ఎందుకు సంతోషంగా ఉన్నారని ఓ బాలుడు నన్ను అడిగితే అలా లేరని తెలిపాను. పాదయాత్ర కాశ్మీర్ లోయలోకి ప్రవేశించగానే పోలీసు సిబ్బంది అదృశ్యమయ్యారు.
అయితే కాశ్మీర్లోని వేలాదిమంది ప్రజలు జాతీయ పతాకంతో అండగా నిలిచారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరంగాను చేబూని పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. కాశ్మీర్ యువత చేతిలో జాతీయ పతాకం ఉంది. సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఇంతకుముందెన్నడూ యువకుల చేతిలో తిరంగాను చూడలేదన్నారు. పార్లమెంటులో ప్రధాన మంత్రి ప్రసంగం చూశాం.ఆయన శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో కొంతమంది బిజెపి వ్యక్తులతో కలిసి జాతీయజెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఆయనకు సమస్య అర్థం కావడం లేదని తెలిపాను. మోడీ లాల్‌చౌక్‌లో జెండాను ఎగురవేశారు. అయితే భారత్ జోడో యాత్ర వేలాదిమంది కాశ్మీరీలు జాతీయ జెండాను ఆవిష్కరించేలా చేసింది. ఆ విషయం ప్రధానికి అర్థం కాలేదని రాహుల్ అన్నారు. మోడీ ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలకు భారత త్రివర్ణ పతాకంపై ప్రేమను తొలగిస్తే మేము దాన్ని అందించాం. జాతీయ జెండాపట్ల ప్రేమ వారికి హృదయంలోంచి వచ్చిందని కరతాళ ధ్వనుల మధ్య రాహుల్ గాంధీ అన్నారు.