న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు ప్రజాగళమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన కొద్ది సేపటికే రాహుల్ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు బహిష్కరించిన విషయం తెలిసిందే.
మరో వైపు పార్లమెంటు భవనానికి పునాది వేసినప్పుడు అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింధ్‌ను పక్కన పెట్టారని, ఇప్పుడుప్రారంభోత్సవం వేడుకలకు ప్రస్తుత రాష్ట్రపతి ద్రైపది ముర్మును పక్కన పెట్టారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ విమర్శించారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని దుయ్యబట్టారు. ఆయా రాజ్యాంగ పదవులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.