- Advertisement -
న్యూఢిల్లీ : కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ముప్పుగా పరిణమిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించిన నేపథ్యంలో దేశం లోని ప్రజలందరికీ టీకా భద్రత ప్రభుత్వం కల్పించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన హాస్టాగ్ ఉపయోగించి ట్వీట్ చేశారు. టీకా డోసుల సంఖ్యలు ఎక్కువ కాలం ప్రభుత్వం దాచిపెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోడీ ఫొటో ఉండడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా దేశంలో ఎందరికి టీకాలు అందాయో పట్టికను చూపిస్తూ జనాభాలో 31.19 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు పూర్తి వ్యాక్సిన్ పొందారని వివరించారు. డిసెంబర్ నెలాఖరు వరకు రోజుకు 23.3 మిలియన్ మందికి టీకా డోసులు ఇవ్వాల్సి ఉండగా, గత వారం నుంచి రోజుకు 6.8 మిలియన్ డోసులే ఇస్తున్నారని విమర్శించారు.
- Advertisement -