Tuesday, January 21, 2025

దేశంలో ప్రధాని లేని సమయంలో అఖిలపక్ష సమావేశమా ? : రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో చెలరేగుతున్న హింసాత్మక సంఘటనలపై చర్చించడానికి ఈనెల 24న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు గురువారం ఉదయం కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ధ్వజమెత్తారు. “గత ఏభై రోజులుగా మణిపూర్ భగ్గుమంటున్నా ప్రధాని మోడీ పెదవి విప్పకుండా మౌనం వహించారు. దేశంలో ఆయన లేనప్పుడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దీన్నిబట్టి ప్రధాని మోడీకి ఈ సమావేశం అంత ముఖ్యం కానట్టు కనిపిస్తోంది. ” అని రాహుల్ విమర్శించారు.

ఈ సమస్యపై ప్రధాని మౌనం వహించడాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. యుపిఎ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ ఈ హింస మణిపూర్ రాష్ట్రాన్ని తీవ్రంగా గాయపర్చిందని వ్యాఖ్యానించారు. యాధృచ్ఛికంగా ఒకరోజు ముందుగా అంటే 23న విపక్షాలు సమావేశమవుతున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోడానికి అనుసరించవలసిన వ్యూహాలపై వివిధ పార్టీలకు చెందిన నేతలు పాట్నాలో సమావేశమై చర్చించనున్నారు. అయితే కేంద్రం మొట్టమొదటిసారి మణిపూర్ సమస్యపై రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షసమాశానికి పిలుపునివ్వడం గమనార్హం.

కేంద్ర మంత్రి అమిత్‌షా అన్ని పార్టీలను ఆహ్వానించారని, పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ సమావేశం కానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మణిపూర్ ప్రతిష్టంభనపై చర్చిస్తారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News