Monday, November 18, 2024

అవినీతి బిజెపి ప్రభుత్వంపై పోరాటానికి భయపడవద్దు

- Advertisement -
- Advertisement -
Rahul gandhi comments on Rafale deal
కాంగ్రెస్ నాయకులకు రాహుల్ సూచన

న్యూఢిల్లీ : ప్రతి అడుగులో సత్యం మీవెంట ఉంటే అవినీతి కేంద్ర బిజెపి ప్రభుత్వంతో పోరాడడానికి ఏమాత్రం భయపడవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్టీ నాయకులకు సూచించారు. రఫేల్ ఒప్పందంలో దళారులకు భారీగా 7.5 మిలియన్ యూరోల వరకు ముడుపులు ముట్టాయని ఫ్రెంచి ఇన్వెస్టిగేటివ్ జర్నల్ మీడియా పార్ట్ తాజాగా వెల్లడించడంపై రాహుల్ పై విధంగా బిజెపి ప్రభుత్వంపై పోరాటం సాగించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నుంచి కానీ, డసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. సత్యం మీవద్ద ఉన్నప్పుడు ఆందోళన ఎందుకు ? అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించండి. ఆపవద్దు. అలసిపోవద్దు. భయపడవద్దు అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News