Monday, January 20, 2025

సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యల ఫలితం.. కాంగ్రెస్‌తో శివసేన తెగతెంపులు?

- Advertisement -
- Advertisement -
కాంగ్రెస్‌తో శివసేన తెగతెంపులు?

ముంబై: సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చివరికి కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నాయకత్వపు శివసేన మధ్య తెగతెంపులకు దారితీసేలా ఉన్నాయి. తమ సిద్ధాంతపర వ్యతిరేక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పొసగదని , తెంచుకుంటామని శివసేన వర్గాలు శుక్రవారం తెలిపాయి. మితవాద పక్ష సిద్ధాంతకర్త విడి సావర్కర్ పట్ల రాహుల్ రెండు రోజుల క్రితం తీవ్రస్థాయి వ్యాఖ్యలకు దిగారు.

సావర్కర్ పిరికివాడు, బ్రిటిషర్లకు సరెండర్ అయ్యాడని మహారాష్ట్రలో భారత్ జోడో యాత్రలో ఉన్నప్పుడే వ్యాఖ్యానించారు. దీనితో రాహుల్‌పై వెంటనే ఉద్ధవ్ థాకరే విమర్శలకు దిగారు. ఇప్పుడు పార్టీలు రెండూ దూరం అయ్యే సంకేతాలు వెలువడ్డాయి. తాము ఇక కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాదీ సంకీర్ణంలో కొనసాగేది లేదని శుక్రవారం ఉదయం శివసేన ఎంపి సంజయ్ రౌత్ తెలిపారు. దీనికి సంబంధించి తమ పార్టీ నేత ఉద్ధవ్ కీలక ప్రకటన వెలువరిస్తారని తెలిపారు. తమది తీవ్రస్థాయి స్పందన అని, ఆయన (రాహుల్) అంత మాట అన్నాక ఇక తాము ఊరుకుంటామా? అని రౌత్ ప్రశ్నించారు.

ఇంతకంటే మీకేం కావాలని విలేకరుల వద్ద శివసేన ఎంపి అరవింద్ సావంత్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇంతకు ముందు పిడిపితో బిజెపి పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఎటువంటి స్పందన వెలువడిందో ఇప్పుడూ ఇక్కడ ఇదే విధంగా స్పందిస్తామని ఎంపి తెలిపారు. సావర్కర్ పట్ల వ్యాఖ్యలకు దిగేవారిని సహించడం కుదురుతుందా? ఎందుకంటే సావర్కర్ సిద్ధాంతాలను తాము విశ్వసిస్తున్నామని, కాంగ్రెస్ ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించి ఉండాల్సింది కాదని సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తరువాత శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిలతో మహా వికాస్ అఘాథీ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News