Monday, December 23, 2024

నాటి వైఎస్‌ఆర్ పథకాలే నేడు దేశానికి ఆదర్శం: రాహుల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాడు ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వివిధ రంగాలలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలే నేడు దేశమంతటికి ఆదర్శంగా ఉన్నాయని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.శనివారం పులివెందులు నియోజకవర్గం పరిధిలోని ఇడుపుల పాయలలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించిన షర్మిల వెనువెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం నేరుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజవర్గానికి చేరుకుని అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ

కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్టర్ ద్వారా చూపిన అభిమానానికి షర్మిల స్పందించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను స్మరించుకుంటూ రాహుల్ చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ న్యాయకత్వంలో ఈ దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్‌ఆర్ అని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడుగా తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు. వైఎస్‌ఆర్ తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఈ దేశానికి ఆదర్శం అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాహుల్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

పాలేరు మట్టిసాక్షిగా సంక్షేమ పాలన అందిస్తా:
పాలేరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ ఇదే పాలేరు మట్టి సాక్షిగా పాలేరు ప్రజలకు వైయస్‌ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిచ్చానని తెలిపారు. రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీ రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీలతో రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొస్తానని వివరించారు. మళ్లీ చెబుతున్నా.. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తా అని షర్మిల ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాటిస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని , అతికొద్ది రోజుల్లోనే మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో ప్రారంభించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి పాలేరులోనే ముగిస్తానని షర్మిల వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News