Monday, April 28, 2025

షర్మిలకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహిళలను అవమానించడం, వారిపై మాటల దాడి చేయడం నీచమైన పనంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహు ల్ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పనిని కేవలం పిరికి పందలు చేస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్ సునీత లపై సోషల్ మీడియా వేదికగా దాడులు జరగడం, చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఆదివారం ఆయ న ఈమేరకు ట్వీట్ చేశారు. మహిళలను కించపరచడం, బెదిరించడం పిరికిపందల చర్య అని, దురదృష్టవశాత్తూ శక్తి హీనులకు ఇదొక ఆయుధంగా మారిందని రాహుల్ గాంధీ చెప్పారు. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా అండగా నిలబడతానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News