Friday, December 20, 2024

ట్విట్టర్ ఇకపై విపక్షాల గొంతు నొక్కదని భావిస్తున్నా: రాహుల్

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi congratulates Elon Musk

న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ట్విట్టర్‌ను తన చేతుల్లోకి తీసుకున్న ఎలాన్‌మస్క్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా మస్క్‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్విటర్ ఇకపై విపక్షాల గొంతు నొక్కదని భావిస్తున్నట్టు చెప్పారు. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ట్విటర్ పనిచేస్తుందని, నిజనిర్ధారణ మరింత పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌లో కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి విపక్షాల గొంతు నొక్కే చర్యలకు పాల్పడదని భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. అదే విధంగా తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల చోటు చేసుకున్న మార్పులకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను ట్వీట్‌కు జత చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News