Monday, December 23, 2024

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ గాంధీ..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజల సర్కార్ ను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా నియమితులైన రేవంత్ రెడ్డికి కాంగ్రెట్స్ అంటూ రాహుల్ గాంధీ ఫోటోలను షేర్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిన అనంతరం అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఉదయం ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లతో రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీలను కలిశారు. డిసెంబర్ 7న(గురువారం) హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి తన ప్రమాణస్వీకారం రావాల్సిందిగా వారిని రేవంత్ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News