Wednesday, January 22, 2025

ట్రక్కు డ్రైవర్లతో అద్భుతమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు జాతీయ రహదారిపై ట్రక్కులో ప్రయాణించి డ్రైవర్లతో వారి సమస్యలపై సంభాషించిన సంగతి తెలిసిందే. 35 నిమిషాల ఈ వీడియోను మంగళవారం ఆయన షేర్ చేశారు. “ఈ ఆరు గంటల ప్రయాణంలో ట్రక్కు డ్రైవర్లతో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. రోడ్డు పైనే 24 గంటలు గడిపా. దేశం లోని ప్రతిచోట వారు కలిశారు.” అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

తన ప్రయాణం మొత్తం వీడియోను తన యూట్యూబ్ పేజీలో కూడా ఉంచారు. “భారత్ జోడో యాత్రలో ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యారో అదే విధంగా రాహుల్ ప్రజలను కలుసుకొంటుండడం కొనసాగిస్తున్నారు. జాతీయ రహదారి 44పై ముర్దాల్ వద్ద ఒక దాబా వద్ద కొంతమంది ట్రక్కు డ్రైవర్లతో చర్చించారు. అక్కడ నుంచి సిమ్లాకు వెళ్తూ చండీగఢ్ వరకు ట్రక్కుపై ప్రయాణించారు.” అని కాంగ్రెస్ పార్టీ వివరించింది.

డ్రైవర్లతో సంభాషించే సమయంలో ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నుంచి ప్రేమ్ రాజ్‌పూత్‌తో కలిసి ప్రయాణించడానికి రాహుల్ నిర్ణయించుకున్నారు. ఆరుగంటల ప్రయాణంలో రాజ్‌పూత్‌తోను, అతని సహచరుడు రాకేష్‌తోనూ రాహుల్ సంభాషణ ఆసక్తిగా సాగిందని కాంగ్రెస్ పేర్కొంది. మూడు కోట్ల మంది ప్రత్యక్షంగా ట్రక్కు పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారని, ప్రతి ఏటా కొత్తగా 9 లక్షల మంది ట్రక్కు డ్రైవర్ల డిమాండ్ ఉంటోందని ఈ వీడియో కథనం తెలియజేసింది.

అయితే స్వతంత్ర అధ్యయనంలో ఉత్తరప్రదేశ్ లోథీ సమాజానికి చెందిన ప్రేమ్ రాజ్‌పూత్ వంటి ట్రక్కు డ్రైవర్లు తమ కుటుంబ సభ్యులను ట్రక్కు డ్రైవర్ల వృత్తి లోకి దింపేందుకు ఇష్టపడడం లేదు. చాలా మంది ట్రక్కు డ్రైవర్లు తమను పోలీస్‌లు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. దీంతోపాటు వీరికి చాలా తక్కువగా ఆదాయం వస్తోంది. అది కూడా సరిగ్గా అందడం లేదని తేలింది. ఇవే విషయాలను గణాంకాలను రాహుల్‌కు ట్రక్కు డ్రైవర్లు వెల్లడించారు. దీనిపై వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వారి బతుకులను మెరుగుపరుస్తుందని రాహుల్ వారికి హామీ ఇచ్చారని కాంగ్రెస్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News