Saturday, January 11, 2025

Rahul Gandhi: ముట్టుకుంటే ముక్కు రాశానంటారు: బిజెపిపై రాహుల్ చురకలు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మసిపూసి మారేడుకాయ చేయడంలో రాజకీయ పారీలకు చెందిన సోషల్ మీడియా టీమ్‌లు కాకలు తీరిపోయాయి. ఈ విషయంలో బిజెపి సోషల్ మీడియా నిర్వాహకులు మిగతా పార్టీల కన్నా ఒక అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీపుకు రాహుల్ గాంధీ తన ముక్కును రాస్తున్నట్లు ఒక వీడియోను సృష్టించారు. ఖర్గే కోటుకు తన ముక్కును రాస్తూ పార్టీ అధ్యక్షుడినే రాహుల్ టిష్యూ పేపర్‌లా వాడుకుంటున్నారంటూ బిజెపి సోషల్ మీడియా సైనికులు కామెంట్ కూడా పెట్టారు. ఈ వీడియోపై ఇటీవల రాహుల్ చురకలు అంటించారు.

వయోభారం కారణంగా పార్లమెంట్ వెలుపల మెట్లు దిగడంలో ఇబ్బంది పడుతున్న మల్లికార్జున్ ఖర్గేకు రాహుల్ చేయూత అందించారు. ఈ సందర్భంగా ఖర్గేతో రాహుల్ మాట్లాడుతూ..నేను మిమల్ని తాకినా మీ వీపుకు నా ముక్కు రాస్తున్నానని అంటారు వాళ్లు(బిజెపి). ఆ వీడియో మీరు చూశారా.. ఆ ఆరోజు మీకు సాయం చేస్తున్నా.. కాని మీ వీపుకు నా ముక్కు రాస్తున్నానని అంటున్నారు వాళ్లు.. అంటూ ఖర్గేతో రాహుల్ అనడం తాజా వీడియోలో వినిపించింది. దీనిపై స్పందిస్తూ క్రేజీ పీపుల్ అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News