Monday, December 23, 2024

వారు భారత్ గళాన్ని నొక్కేశారు

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi
లండన్: కాంగ్రెస్ నేత కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇతర విపక్ష పార్టీల కన్నా గొప్పగా ఏమీ లేదన్నారు. ఇదే సమయంలో ఆయన మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ ఆత్మ లేకుండా ఏ గళానికి అస్థిత్వమే ఉండదన్నారు. నేడు భారత్ గళాన్ని నొక్కేశారని విమర్శించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్నది ఇదివరలో పాకిస్థాన్‌లో జరిగిందన్నారు. బిజెపితో ఎన్నికల్లో పోరాడే శక్తి కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ భారత్‌ను తిరిగిపొందడానికి పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ నేటి పోరాటం భావాల పోరాటం అన్నారు.మేము కేవలం బిజెపితో పోరాడటంలేదు. పూర్తి సంస్థాగత విధానంతో పోరాడుతున్నామన్నారు. కానీ మాకు వారి వద్ద ఉన్నంత ఫండ్ లేదని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మేము పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి విషయలపై పోరాడుతున్నాం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్యాంగ్యాంగ్‌లో చైనా రెండు వంతెనలు నిర్మించడంపై మోడీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. తొలి వంతెన కడుతున్నప్పుడు ‘మేము దృష్టి సారిస్తున్నాము’ అన్నారు. ఇక రెండోసారి వంతెన కడుతున్నప్పుడు ప్రభుత్వం ‘పరిస్థితిపై మేము దృష్టి సారిస్తున్నాం’ అని తెలిపింది. భారత భద్రత, ఐక్యతను కాపాడాల్సి ఉందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News