- Advertisement -
కేంద్రంపై రాహుల్ ఘాటు విమర్శ
న్యూఢిల్లీ: ఆసుపత్రులలో ఆక్సిజన్ అందదు, ఐసియు పడకలు అరకొరనే ..ఇది కేంద్ర ప్రభుత్వ పూర్తి వైఫల్యం అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనా కేసులు విపరీత సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగా ఆసుపత్రులలో కనీస సౌకర్యాలు కూడా లేవని , ప్రస్తుత దుస్థితి ప్రభుత్వ నిర్లక్షం, బాధ్యతారాహిత్యం వల్లనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకితే మనిషి శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం, ఐసియూ బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో కరోనా తీవ్రతరం అయి, ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని , గౌరవనీయ భారత ప్రభుత్వం (జిఒఐ) ఈ దారుణ స్థితికి బాధ్యత వహించి తీరాల్సిందే అని రాహుల్ తమ ట్వీట్‌లో తెలిపారు.
- Advertisement -