Wednesday, January 22, 2025

జై శ్రీరామ్ అని నినదించండి.. తరువాత ఆకలితో చావండి

- Advertisement -
- Advertisement -

భోపాల్ : దేశంలో నిరుద్యోగితపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మంగళవారం తీవ్రంగా విమర్శించారు. ‘జై శ్రీరామ్ అని నినదించండి’ అని దేశ ప్రజలను కోరే ప్రధాని వారు ‘ఆకలితో చావాల’ని అనుకుంటుంటారని రాహుల్ ఆక్షేపించారు. మధ్య ప్రదేశ్‌లోని సారంగ్‌పూర్ నుంచి మంగళవారం తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తిరిగి మొదలైనప్పుడు రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇలా ఉండగా, బిజెపి కార్యకర్తలు ‘మోడీ, మోడీ’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో రాహుల్‌కు స్వాగతం పలికారు.

వారు ఆయనకు బంగాళాదుంపలను కూడా ఇవ్వజూపి, అందుకు ప్రతిగా తమకు బం గారం ఇవ్వాలని కోరారు. బిజెపి కార్యకర్తల నినాదాలను స్వాగతించిన రాహుల్ నిరుద్యోగితపై ప్రధాని తీరును విమర్శించారు. నిరుద్యోగులైన యువజనులు ‘రోజు అంతా (సోషల్ మీడియాలో) రీల్స్ చూస్తుంటారు’ అని రాహుల్ తెలిపారు. ‘మీరు ఫోన్లు చూస్తుండాలని, జై శ్రీరామ్ అని నినదించాలని, ఆ తరువాత ఆకలితో చావాలని ప్రధాని కోరుతుంటారు’ అని రాహుల్ ఆరోపించారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకం గురించి రాహుల్ ప్రస్తావిస్తూ, ‘ఇంతకుముందు సాయుధ బలగాలు యువతకు రెండు గ్యారంటీలు ఇస్తుండేవి. వాటిలో ఒకటి యువతకు పింఛన్ ఇవ్వగలం, రెండవది వారు తమ ప్రాణాలు కోల్పోతే గౌరవం లభిస్తుంది’ అని చెప్పారు. ‘ఇప్పుడు అగ్నివీర్ పథకం అమలు జరుగుతోంది. దీని కింద నలుగురిని చేర్చుకుంటారు. ఆ నలుగురిలో ముగ్గురిని తొలగిస్తారు. ఆ ముగ్గురు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు’ అని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News