Wednesday, January 22, 2025

రాయ్‌బరేలీలో రాహుల్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీ లోక్‌సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ వేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనకు రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. రూ. 92459264 మేరకు చరాస్తులు ఉన్నట్లు రాహుల్ తెలియజేశారు. వాటిలో రూ. 38133572 విలువ చేసే షేర్లు, రూ. 2625157 బ్యాంకు బ్యాలెన్స్, రూ. 1521740 బంగారం బాండ్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 111502598 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడురాహుల్ తెలిపారు.

వాటిలో సొంతంగా సంపాదించిన రూ. 90489000 విలువ చేసే స్థిరాస్తులు, రూ. 21013598 విలువ చేసే వారసత్వ ఆస్తులు చేరి ఉన్నాయి. చేతిలో రూ. 55 వేల నగదు ఉన్నట్లు తెలిపిన రాహుల్ రూ. 4979184 మేరకు అప్పులు ఉన్నాయని వెల్లడించారు. రాహుల్ నామినేషన్ పత్రాల ప్రకారం,ఆయనకు గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వార్షిక ఆదాయం రూ. 10278680.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News