Sunday, January 5, 2025

అదానీని అరెస్టు చేయాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

అమెరికాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం డిమాండు చేశారు. అదానీని కేంద్రం కాపాడుతోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిన్న కేసులలోనే వేలాదిమంది పౌరులు దేశంలో అరెస్టు అవుతుంటే అదానీ ఎందుకు జైలుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అవినీతి కేసులో అమెరికా అధికారులు కోర్టులో దాఖలు చేసిన అభియోగాలలో అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్(ఎఫ్‌సిపిఎ)ఉల్లంఘనలకు పాల్పడినట్లు గౌతమ్ అదానీ, ఆయన సోదరుని కుమారుడు సాగర్ అదానీలపై అభియోగాలు లేవని అదానీ గ్రూపు ప్రకటించిన కొన్ని గంటలకే రాహుల్ నుంచి ఈ డిమాండు రావడం గమనార్హం. గౌతమ్ అదానీ,

సాగర్ అదానీలపై సెక్యూరిటీల మోసం జరిగినట్లు మాత్రమే అభియోగాలు దాఖలయ్యాయని, వాటికి శిక్షగా జరిమానాలు ఉంటాయని అదానీ గ్రూపు తెలిపిన విషయాన్ని రాహుల్ వద్ద విలేకరులు ప్రస్తావించగా తమపై నమోదైన ఆరోపణలను అదానీలు ఒప్పుకుంటారని మీరు భావిస్తున్నారా..మీరు ఏ లోకంలో ఉన్నారు అంటూ రాహుల్ ఎదురు ప్రశ్నించారు. కచ్ఛితంగా వారు ఆరోపణలను ఖండిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. గౌతమ్ అదానీని అరెస్టు చేయడమే ఇప్పుడు జరగాల్సిన కర్తవ్యమని ఆయన అన్నారు. తేలికపాటి ఆరోపణలకే ఇక్కడ వేలాదిమంది అరెస్టు అవుతున్నారని, ఆ బడా వ్యక్తులపై(అదానీలు) వేలాది కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయని రాహుల్ చెప్పారు. ఆయన జైలులో ఉండాలి..ఆయనను ప్రభుత్వం కాపాడుతోంది అంటూ రాహుల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News