Wednesday, November 13, 2024

అదానీ వ్యవహారంపై జెపిసి వేయాలి

- Advertisement -
- Advertisement -

ముంబై : అదానీ కంపెనీపై ఒసిసిఆర్‌పి నివేదికపై ప్రధాని మోడీ ఏం సమాధానం చెపుతారని కాంగ్రెస్ ఎంపి , నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో వెలువడ్డ జాతీయ ప్రకంపనల విషయం అని దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( జెపిసి) దరాప్తు అ్యవసరం అని డిమాండ్ చేశారు. ఒక మిలియన్ డాలర్ల డబ్బు మన దేశం నుంచి వివిధ మార్గాలలో విదేశాలకు వెళ్లిందని, తిరిగి ఇది దేశానికి చేరిందని నివేదిక తెలిపిందని, దీనిపై ప్రధాని మోడీ తన పాత్ర ఏమీ లేదని తెలియచేసుకోవల్సి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. లేకపోతే సత్యాల వెలికితీతకు జెపిసి దర్యాప్తు చేపట్టాల్సిందే అన్నారు. భారీ స్థాయిలో డబ్బులావాదేవీలు జరిగినట్లు ఫైనాన్షియల్ పత్రికలు పతాక శీర్షికలలో వార్తలు వెలువరించాయి. మరి త్వరలోనే ఢిల్లీలో జరిగే జి 20 సదస్సులో ప్రపంచ దేశాల నేతలు దీనిని ప్రస్తావిస్తే ప్రభుత్వం ఏం జవాబు చెపుతుందని రాహుల్ నిలదీశారు.

ఇండియా కూటమి భేటీలో పాల్గొనేందుకు వచ్చిన రాహుల్ అదానీ వ్యవహారంపై ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధాని మోడీ సంబంధిత విషయంపై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించడం లేదు? దేశానికి అదానీ గ్రూప్‌ను మరీ ఇంత విశిష్టం, ప్రత్యేకంగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. పెట్టుబడులతో అదానీ గ్రూప్ భారీ స్థాయిలో షేర్ల కొనుగోళ్లకు దిగిందని, ఈ విధంగా కృత్రిమంగా షేర్ల ధరలను పెంచి లాభపడి అదానీ గ్రూప్ పలు రంగాలకు విస్తరించుకుందన్నారు. పలు ఆస్తులు కొన్నారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు సొంతం చేసుకున్నారు. ఇదంతా ఏ విధంగా సాధ్యం అయింది? ఈ సొమ్ము అంతా అదానీదేనా? ఇంకెవరిదైనా అయి ఉంటుందా? అదానీ చుట్టే విపరీత స్థాయిలో ధనం కేంద్రీకృతం కావడం ఏ మేరకు సముచితం అని ప్రశ్నించారు. పోనీ నిజాలు తేలితే అప్రతిష్ట తొలిగిపోతుందని అయినా ప్రధాని దర్యాప్తునకు ఆదేశించవచ్చు కదా? ఆయనను అతీత శక్తిగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

వెంటనే దీనిని జాతీయ విషయంగా గుర్తించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అక్రమాలు జరిగితే వెంటనే బాధ్యులను జైలు పాలు చేయాల్సిందే అన్నారు. ప్రధాని ఎందుకు కిమ్మనకుండా ఉంటున్నారు? అంతర్జాతీయ స్థాయి జి 20 సదస్సు నేపథ్యంలో అయినా ముందుగానే సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ప్రధానికి లేదా ? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News