- Advertisement -
న్యూఢిల్లీ : వచ్చే ఆదివారం జరగనున్న నీట్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా గుడ్డిగా ఉంటోందని విమర్శించారు. నీట్‌ను వాయిదా వేసి వారికి న్యాయమైన అవకాశం కల్పించండని రాహుల్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 12 న జరిగే నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే అదే రోజున 12 వ తరగతి ఇంప్రూవ్‌మెంట్/కంపార్ట్‌మెంట్ పరీక్షలు ఉన్నందున నీట్‌ను వాయిదా వేయాలని పలువురు కోరగా, న్యాయస్థానం అంగీకరించలేదు. నీట్ జాతీయస్థాయి పరీక్షలు కావడంతో దాంట్లో జోక్యం చేసుకోవడం సబబు కాదని , ఒక్కశాతం మంది కోసం మొత్తం వ్యవస్థను ఆపలేమని కోర్టు అభిప్రాయపడింది. ఈ పరిణామాలపై స్పందించిన రాహుల్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
- Advertisement -