Tuesday, January 21, 2025

సైన్యం తీరు భేష్.. దిగ్విజయ్ చెత్త మాటలు

- Advertisement -
- Advertisement -

జాజ్జార్ కొట్లి/జమ్మూ : సర్జికల్ దాడులపై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మంగళవారం ఖండించారు. సైన్యం పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికావని సింగ్‌ను మందలించారు. దేశ సాయుధ బలగాలు శక్తివంచన లేకుండా బాగా పనిచేస్తున్నాయని, ఇందుకు సాక్షాలు రుజువులు చూపెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ ఇప్పుడు జమ్మూ ప్రాంతంలో పాదయాత్రలో ఉన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని రాహుల్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ సోమవారం భారత్ జోడో యాత్ర సభలోనే మాట్లాడుతూ సర్జికల్ దాడులు నిజంగా జరిగాయా? ప్రభుత్వం సంబంధిత విషయంపై బూటకాలకు దిగుతోందని విమర్శించారు. సర్జికల్ స్ట్రైయిక్స్ జరిగాయనడానికి ఆధారాలు ఏవని సింగ్ ప్రశ్నించారు. ఇది రాద్ధాంతానికి దారితీసింది. దిగ్విజయ్ మాటలపై విలేకరుల ప్రశ్నలకు రాహుల్ స్పందించారు.

సంభాషణల దశలో కొందరు వ్యక్తులు అవాకులు చవాకులకు దిగుతుంటారని, అయితే సీనియర్ నేత ఒక్కరు ఈ విధంగా మాట్లాడటం తనకు బాధ కల్గించిందని, ఇది అనుచితమైన విషయం అని రాహుల్ తెలిపారు. తనకు సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని, వారు అసాధారణ రీతిలో పనిచేస్తున్నారని, దిగ్విజయ్ మాటలతో తాను కానీ తమ పార్టీ కానీ ఏకీభవించడం లేదని రాహుల్ స్పష్టం చేశారు. ఏవో మాటల సందర్భంలో ఆయన చెప్పిన వాటిని కేవలం వ్యక్తిగతం అనుకోవల్సి ఉంటుంది. పార్టీతో నిమిత్తం లేదని స్పష్టం చేస్తున్నామని రాహుల్ స్పందించారు. దిగ్విజయ్ వంటి సీనియర్ ఇంత చెత్త మాటలకు దిగడం భావ్యం కాదన్నారు. అయితే సింగ్‌పై పార్టీపరంగా ఏదైనా చర్య తీసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ నియంతృతం లేదని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News