Saturday, December 21, 2024

విభేదాలుంటే నాతో మాట్లాడాలి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మంగళవారం రాహుల్ మీడియాలో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని, విభేదాలుంటే రాష్ట్ర ఇన్‌ఛార్జ్ లేదా తనతో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడవద్దని హెచ్చరించారు. కమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం అందరూ ఐక్యంగా పని చేయాలని సూచించారు.

Also Read: ఈటల అల్లుడు, కోడలు ముదిరాజులేనా?: కౌశిక్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News