Saturday, January 11, 2025

రాహుల్‌పై అనర్హత వేటు: పార్లమెంట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపి రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ పార్లమెంట్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు వెలువరించిన మార్చి 23వ తేదీ నుంచి రాహుల్ గాంధీ అనర్హత అమలులోకి వస్తుందని లోక్‌సభ సచివాలయం శుక్రవారం ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వం నుంచి రాహుల్ గాంధీ అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది.

కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ర్రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోడీ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగల్లా ఉన్నారంటూ 2019లో గుజరాత్‌లో రాహుల్ చేసిన చేసిన వ్యాఖ్యలపై బిజెపి కార్యకర్త ఒకరు పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో గురువారం సూరత్ కోర్టు తీర్పు వెలువరిస్తూ రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ తీర్పును నెలరోజుల పాటు నిలిపివేసింది. అంతేగాక ఆయనకు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. కాగా..రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News