Saturday, February 22, 2025

వయనాడ్ బాధితులకు రాహుల్ ఒక నెల జీతం విరాళం

- Advertisement -
- Advertisement -

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన బాధితులకు పునరావాస కార్యక్రమాల కోసం కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి)కి లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక నెల జీతం రూ. 2.3 లక్షలు విరాళంగా అందజేసినట్లు పార్టీ రాష్ట్ర శాఖ బుధవారం వెల్లడించింది. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ సమీకరిస్తున్న నిధుల్లో భాగంగా ఆ విరాళం అందజేసినట్లు కెపిసిసి ప్రధాన కార్యదర్శి ఎం లిజు ఒక ప్రకటనలో తెలియజేశారు. వయనాడ్ జిల్లాలో మూడు గ్రామాల్లో జూలై 30న కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 200 మందికి పైగా మరణించగా 78 మంది జాడ ఇంకా తెలియరావడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News