Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రోడ్ షో.. వివరాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల వార్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారంతో పొలిటికల్ పార్టీల ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు ప్రదర్శిస్తూ.. వీలైనన్నీ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.

రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తూ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో రాహుల్‌ ప్రచారం చేయనున్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ప్రధాని మోడీ హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News