Sunday, February 23, 2025

వయనాడ్‌కు ప్రియాంకే సరైన ప్రతినిధి: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేయడానికి ఒక రోజు ముందు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ, ఆ నియోజకవర్గానికి తన సోదరిని మించి మెరుగైన ప్రతినిధిని తాను ఊహించజాలనని చెప్పార. ప్రియాంక గాంధీ బుధవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ సమయంలో ఆమె వెంట ఉండనున్నారు. ‘వయనాడ్ ప్రజలకు నా గుండెలో ప్రత్యేక స్థానం ఉంది. వారికి నా సోదరి ప్రియాంక గాంధీ కన్నా మెరుగైన ప్రతినిధిని నేను ఊహించజాలను’ అని రాహుల్ గాంధీ మంగళవారం ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘పార్లమెంట్‌లో వయనాడ్ అవసరాల గురించి ఆమె బలంగా చెప్పగలరని, శక్తిమంతమైన వాణి కాగలదని నా నమ్మకం’ అని రాహుల్ తెలిపారు. ప్రియాంక గాంధీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్ ముందునామినేషన్ పత్రాల దాఖలు చేయడానికి ముందు ఉదయం 11 గంటలకు ఆమె, రాహుల్ కల్పెట్ట కొత్త బస్ స్టాండ్ నుంచి రోడ్‌షోకు నాయకత్వం వహిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News