Sunday, January 19, 2025

వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్‌

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కేరళలోని వయనాడ్‌ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వయోనాడ్ లో రోడ్ షో నిర్వహించారు రాహుల్ గాంధీ.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి, కన్హయ్య కుమార్ తదితరులు ఉన్నారు. కాగా, వయనాడ్‌ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం.. ఇది రెండోసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News