- Advertisement -
న్యూఢిల్లీ : దేశం లోని నిరుద్యోగాన్ని పెంచుతూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొట్టడమే కాకుండా నియంతృత్వంతో దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని మోడీ ప్రభుత్వం పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అభ్యర్థలు నిరసన చేస్తున్న వీడియోను ఆదివారం తన ట్విట్టర్‌లో రాహుల్ గాంధీ షేర్ చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రశ్నలు అడగొద్దు, నోరు మెదపొద్దు, శాంతి పూర్వకంగా నిరసన చేపట్టవద్దు. కొత్త ఇండియాలో హక్కుల కోసం డిమాండ్ చేస్తే అరెస్ట్‌లు చేయబడతాయి. యువతను నిరుద్యోగం వైపు మళ్లిస్తూ కోట్లాది కుటుంబాల నమ్మకాల్ని బద్దలు కొడుతున్నారు. ఈ నియంతృత్వ ప్రభుత్వం దేశ భవిష్యత్‌ను ధ్వంసం చేస్తోంది అని రాహుల్ ట్వీట్ చేశారు.
- Advertisement -